భూపాలపల్లి కలెక్టరేట్ ఏ ఓ ములుగు కు బదిలీ

2

విశ్వంభర భూపాలపల్లి జూలై 23 : - కలెక్టరేట్ లో ఏఓ విధులు ఎంతో కీలకమని   భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహేష్ బాబు ఇటీవల  ములుగు జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.   జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఏవో మహేష్ బాబుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ లో పరిపాలన అధికారి పదవి చాలా  కీలకమని అన్నారు. ఏ ఓ మహేష్ బాబు కలెక్టరేట్ తో పాటు అన్ని శాఖలను సమన్వయం చేశారని అన్నారు.  ఏఓ మహేష్ బాబు దాదాపు 6  సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా సేవలు అందించారని, అనుభవం కలిగిన అధికారి అని పేర్కొన్నారు. అందరితో కలిమిడిగా ఉంటూ సమన్వయంతో విధులు. నిర్వహించారని ఆయన సేవలను కొనియాడారు.
 ఈ కార్యక్రమంలో గెజిటెడ్ సంఘ అధ్యక్షులు శామ్యూల్, వైస్ ప్రెసిడెంట్ అవినాష్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డి పి ఆర్ ఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి విజయభాస్కర్,  ఉద్యానవన అధికారి సంజీవరావు, డిఆర్డిఓ నరేష్, ఎస్సి కార్పోరేషన్ ఈ డి వెంకటేశ్వర రావు, ఎల్డిఎం తిరుపతి,  విద్యాశాఖ అధికారి రాజేందర్, డి టి ఓ , పి ఎ ఓ, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More అంతిరింతుర కొండపై సామూహిక వ్రతాలు