వాట్సాప్ డీపీతో జాగ్రత్త... డీపీ తో అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకున్నట్లే...!

WhatsApp Image 2024-07-26 at 13.23.06_65663c54విశ్వంభర జూలై 26 : - మీ భార్యంటే మీకు అతిప్రేమా.. మీ ప్రేమను చూయించడానికి ఆమె ఫోటోనే వాట్సప్ డీపీగా పెడుతున్నారా. లేదంటే ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్, కవర్ పిక్చర్‌లోగానీ ఆమె ఫోటో ఉంచుతున్నారా... అయితే జాగ్రత్త. సైబర్ నేరస్తులు ఆ ఫోటోలతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిరావొచ్చు.
 చెన్నైలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.

చెన్నై అయ్యన్నవరంలో నివసించే ఓ వ్యక్తిని ఇటీవల సైబర్ నేరగాళ్లు వేధిస్తున్నారు. ఆయన భార్య నగ్నఫోటోను పంపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అడిగినంత డబ్బివ్వకుంటే ఆఫోటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ వేధింపులు భరించేక ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సైబర్ నేరగాళ్ల వేధింపుల గురించి వివరించాడు. వెంటనే స్పందించిన పోలీసులు కేసును సైబర్ వింగ్ కు బదిలీచేశారు. అసలు నేరగాళ్లకు ఫోటో ఎలా దొరికిందని ఆరా తీశారు. అందులో అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తి వాట్సప్ డీపీగా పెట్టుకున్న ఫోటోనే సైబర్ నేరగాళ్లు మార్పింగ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 

Read More V3 న్యూస్ ఛానల్ లో ఘనంగా వినాయక చవితి