ఆత్మకూరు డబుల్ బెడ్ రూమ్ లో  సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి

ఆత్మకూరు డబుల్ బెడ్ రూమ్ లో  సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం

WhatsApp Image 2024-07-04 at 5.53.05 PM

విశ్వంభర, ఆత్మకూరు(ఎం)జూలై 04 : 

Read More విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో బహిర్భూమికి వసతులు లేవని  వెంటనే సెప్టిక్ ట్యాంకర్ నిర్మాణం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గురువారం రోజున ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఉన్న సమస్యలను సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించి అక్కడ నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న మహిళలు బహిర్భూమికి వెళ్ళడం కోసం  పాతకాలం పద్ధతులలో  చెట్లు వెతుక్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

WhatsApp Image 2024-07-04 at 5.53.04 PM

కనీసం  సెప్టిక్ ట్యాంకులు ఏర్పాటు చేయడం, డ్రైనేజీనీ నిర్మించడం కనీస బాధ్యతని అయినా ప్రభుత్వాలు విస్మరిచ్చాయని విమర్శించారు.కరెంట్ తీగలను ఇంటికి కిటికీలకు అనుకునే విధంగా సరియైన పద్ధతులు లేకుండా నిర్మాణం చేశారని ఫలితంగా వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నదని తెలియజేశారు .ఇంటికి కిటికీల ప్రేమలున్నాయి తప్ప గ్లాస్ లు గానీ,చెక్కలు గాని లేవని రాత్రి వేళలో అన్నం ప్లేట్లలో పురుగులు నిండుతున్నాయని  నివాసం వుంటున్నవారు ఇబ్బందుల పడుతున్నారని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. 
సిపిఎం పోరుబాట కార్యక్రమంలో మండల కార్యదర్శి వేముల బిక్షం ,మండల కమిటీ సభ్యులు చెర్కు మల్లేశం, గుండబోయిన  స్వామి , తుమ్మల సత్య నారాయణ రెడ్డి, నాయకులు కందడి వెంకట్ రెడ్డి కమల్, రితీష్ ,డబల్ బెడ్ రూమ్ లలో నివాసం ఉంటున్న గర్దాసు లింగయ్య, లక్ష్మి ,మాండ్ర మహేందర్ ,సంతోష, రచ్చ రమేష్, భాగ్యమ్మ, కొంగర పరిసరాములు , వేముల నరసింహ, పుష్ప, అంగడి యాదగిరి , వేముల నరసింహ, భాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.