హైదరాబాద్‌లో ఘోరం.. వీధికుక్కల దాడిలో చిన్నారి దుర్మరణం
విహాన్‌పై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు
హైద్రాబాద్ , విశ్వంభర :- వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి దుర్మరణం చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లో చేసుకుంది . నగరంలోని జవహర్‌నగర్ లో రెండేళ్ల బాలుడు విహాన్‌పై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేయగా అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. విహాన్ ఆరు బయట ఆడుకుంటుండగా మంగళవారం రాత్రి వీధి కుక్కలు ఒక్కసారిగా చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ ఘటనలో విహాన్‌కు శరీరమంతా గాయాలు అవ్వడంతో విలవిల్లాడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి విహాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బద్దలయ్యేలా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టేలా చేసింది.