రోగులకు 90శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలి:దామోదర రాజనర్సింహ

రోగులకు 90శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలి:దామోదర రాజనర్సింహ

* మంచిర్యాల‌లో సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి భూమిపూజ‌

విశ్వంభ‌ర‌, మంచిర్యాల: రోగులకు 90శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ వైద్యులు రోగిని తమ క్లయింట్‌గా భావించాలని చెప్పారు. మంచిర్యాలలో రూ.360 కోట్లతో చేపట్టనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ బాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజనర్సింహ మాట్లాడారు. 

ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరనే విమర్శ రావొద్దని వైద్యాధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 7 వేలకుపైగా నర్సు పోస్టులను భర్తీ చేసిందన్న ఆయన.. ప్రతి మండలానికి 2 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ ఉండేలా చర్యలు చేపడతామన్నారు.

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

Tags: