ప్లేస్ ఆఫ్ సేల్స్ - టెక్స్ టైల్స్ యాప్ నిర్వాహకులను అభినందించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ 

యాప్ నిర్వాహకులు  చెరకు అజయ్ , విజయ్ లకు  ప్రశంసలు 

 ప్లేస్ ఆఫ్ సేల్స్ - టెక్స్ టైల్స్ యాప్ నిర్వాహకులను అభినందించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ 

నేటి యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నూతన ఒరవడులను సృష్టించాలి. 

 హైద్రాబాద్ , విశ్వంభర :-నూతనంగా ఆవిష్కరించిన ప్లేస్ ఆఫ్ సేల్స్ - టెక్స్ టైల్స్  అనే యాప్ ను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.నేటి యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నూతన ఒరవడులను కనుగొనడం ఎంతో అభినందించాల్సిన విషయం అని , అలాగే చేనేత పరిశ్రమ , వస్త్ర పరిశ్రమల ద్వారా తయారు చేయబడ్డ ఉత్పత్తులను కాలానుగుణంగా మార్కెట్ లోకి అందించడం , అలాగే వినియోగదారులకు క్రొత్త రకమైన వస్త్రాలను ఆదరించడంతో పాటు ప్లేస్ ఆఫ్ సేల్స్ - టెక్స్ టైల్స్ యాప్ ద్వారా  త్వరితగతిన ప్రజల్లోకి , వ్యాపారస్తులకు దగ్గర చేసే విధంగా ఉందని తెలియజేసారు. యాప్ నిర్వాహకులు అయిన చెరకు అజయ్ , చెరుకు విజయ్ లను పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అభినందించారు . సరిగ్గా ఈ ఆప్ ను ఉపయోగించుకుంటే ఫోన్ లోనే మొత్తం వ్యాపారం చేసుకోవచ్చు అని ఎక్కడపడితే అక్కడికి వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు .సమయం వృధా కాకుండా మంచి ప్రోడక్ట్స్ ను అందిస్తే ఏ రంగం అయినా వృద్ధిలోకి  వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో చెరుకు మల్లయ్య , ఏలే మహేష్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

Read More కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమకాలిన సమస్యల పరిష్కారంపై సమీక్ష 

PLACE OF SALES - TEXTILE ( https://placeofsales.com/ )