వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన పెను ప్రమాదం
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని గయ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గయ జిల్లాలో ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్‌పూర్ జంక్షన్‌లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్‌హెడ్ వైరు తెగిపోయింది.
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని గయ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గయ జిల్లాలో ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్‌పూర్ జంక్షన్‌లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్‌హెడ్ వైరు తెగిపోయింది. ఈ నేపథ్యంలో రాంచీ-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్‌లలో నిలిపివేశారు. దీంతో వందేభారత్-జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెను ప్రమాదం తప్పింది.
రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. రాత్రి 9గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ గుర్పా రైల్వే స్టేషన్‌లో నిలిపారు. అదేవిధంగా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను టంకుప్ప రైల్వే స్టేషన్‌లో నిలిపినట్లు రైల్వే అధికారులు వివరించారు.