ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురెళ్ళ రమేష్ మాదిగ పిలుపు 

 

WhatsApp Image 2024-07-24 at 15.28.20_cedb3d10

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - ఎస్సీ వర్గీకరణ సాధించడమే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని సాధించేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్ పీ ఎస్ రాష్ట్ర అధికారి ప్రతినిధి బొట్ల శంకర్ మాదిగ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరేళ్ల రమేష్ మాదిగ  అన్నారు. భువనగిరి కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో బుధవారం రోజున హలో మాదిగ చలో ఢిల్లీ  మాదిగల మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు భూషి మహేష్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మాదిగ మాదిగ ఉప కులాల న్యాయమైన డిమాండ్ ఏబిసిడి వర్గీకరణ అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. 10 సంవత్సరాల క్రితం కేంద్రం లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండి చెయ్యకపోవడం , అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చి మోసం చేసిందన్నారు. వర్గీకరణ లేకపోవడం వలన మాదిగలు విద్య ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వరీకరణ సాధనకై వచ్చేనెల 9న హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగలు మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగాపురం స్వామి, రాష్ట్ర కార్యదర్శి భైరపాక నాగరాజు, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బొట్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు సంఘీ స్వామి, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంపల్లి వెంకట్, జిల్లా నాయకులు ఇటికాల శ్రీను, కొంపల్లి భాస్కర్, వివిధ మండల అధ్యక్షులు వంగపల్లి చిరంజీవి, తుడి నారాయణ, జెరిపోతుల యాదగిరి, ముడుగుల రామచందర్, బొట్ల పరమేష్, మైలారం రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.