తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీతక్క?

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీతక్క?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు ఎవరికి వెళ్తాయనే దానిపైనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే నెల 21తో పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. దీంతో.. కొత్తవారిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే.. ఈ రేస్‌లో సుమారు 10 ఉన్నారు. కానీ, అధిష్టానం మాత్రం సీతక్క వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి.. మంత్రి సీతక్క పేరును అధిష్టానానికి సూచించారని గాంధీ భవన్‌లో టాక్ నడుస్తోంది. 

 

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

అధిష్టానం కూడా సీఎం మాటకు ఓకే చెప్పేలా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ను ఏకంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతోంది. అందుకే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఇద్దరూ సమన్వయంతో పని చేస్తారనే భావన కాంగ్రెస్ అగ్రనేతల్లో ఉందని టాక్ నడుస్తోంది. పైగా సీతక్క అయితే.. పార్టీలో ఎవరూ వ్యతిరేకించరనే అభిప్రాయం కూడా ఉంది. 

 

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

ఎస్టీ, మహిళ జాబితా ఉన్న సీతక్కకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. ఓట్ బ్యాంక్ కూడా బలపడుతోందని చర్చ నడుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి కూడా సీతక్క పేరు సూచించారట. అయితే.. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నియమిస్తారా? లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నియమిస్తారా చూడాలి