ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే రాజీనామా

ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే రాజీనామా

సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు తన పదవికి రాజీనామా చేశారు. దానిని స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ గురువారం ధ్రువీకరించారు. 

ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో 07-సో రెంగ్-చకుంగ్, 19-రెనోక్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ విజయం సాధించారు. దీంతో సోరెంగ్-చకుంగ్ స్థానానికి రాజీనామా చేశారు. ఎన్నికల నియమావళి 1961 సెక్షన్ 67/A ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన 14 రోజులలోపు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణ కుమారి రాయ్ నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. ఈ విషయంపై ఫేస్‌బుక్‌లో స్పందించిన ఆమె భర్త సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ‘‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది.(సిక్కిం క్రాంతికారి మోర్చా) ఎస్కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా. ఆమె తమకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.

Related Posts