చివరి దశ పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఈవీఎం, వీవీప్యాట్‌లను చెరువులో పడేశారు!

చివరి దశ పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఈవీఎం, వీవీప్యాట్‌లను చెరువులో పడేశారు!

పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్‌లో శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్ బూత్‌లోకి పోలింగ్ ఏజెంట్లను అధికారులు అనుమతించలేదు. దీంతో కొంతమంది ఆగ్రహంతో లోపలికి చొరబడ్డారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు చివరిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ (శనివారం) ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కాగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఏకంగా ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా వాటిని చెరువులో పడేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 

పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్‌లో శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్ బూత్‌లోకి పోలింగ్ ఏజెంట్లను అధికారులు అనుమతించలేదు. దీంతో కొంతమంది ఆగ్రహంతో లోపలికి చొరబడ్డారు. ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎత్తుకెళ్లి, పక్కనే ఉన్న చెరువులో పడేశారు. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Read More రాజ‌కీయాల‌కు లోక్ మంథ‌న్ అతీతం::కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చివరి దశ పోలింగ్‌లో భాగంగా ఎనిమిది రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 లోక్ సభ స్థానాలకు, బీహార్‌లో 8, బెంగల్‌లో 9, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3, పంజాబ్‌లో 13, హిమాచల్ ప్రదేశ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగుతోంది. ఇక ఇవాళ సాయంత్రం 6.30గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

Related Posts