సెలబ్రిటీలున్న లెక్కచేయొద్దు.. డ్రగ్స్ కేసుల్లో సీఎం ఆదేశాలు!

సెలబ్రిటీలున్న లెక్కచేయొద్దు.. డ్రగ్స్ కేసుల్లో సీఎం ఆదేశాలు!

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేయాలన్నా.. డ్రగ్స్ అనే పదం వినాలన్నా భయపడేలా, వణుకుపుట్టేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మాదకద్రవ్యాల కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని పోలీసులకు స్పష్టం చేశారు. అవసరమైతే డ్రగ్స్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు.  

 

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని.. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.   

 

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

హైదరాబాద్ మహానగరానికి సంబంధించి అత్యవసర సహాయక విభాగాలను అన్నింటినీ ఒకే గొడుకు కిందికి తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ORR లోపల ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా ఏడాది పాటు పనిచేసేలా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు. ఒక్కో విభాగం నుంచి ఒక్కో అధికారి బాధ్యత వహించేలా వ్యవస్థ ఉండాలన్నారు సీఎం. జూన్ 4 లోగా పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.