జైలు నుంచి బయటకు వచ్చిన నటి హేమ

జైలు నుంచి బయటకు వచ్చిన నటి హేమ



సినీ నటి హేమ ఈ నడుమ వరుసగా వార్తల్లో ఉంటుంది. ఆమెకు సంబంధించిన చిన్న విషయం కూడా ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతోందనే చెప్పుకోవాలి. ఇక తాజాగా ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బెంగుళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు గురువారం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. 

దాంతో తాజాగా ఆమెను జైలు నుంచి విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం బెంగుళూరులోని శివారులో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదకద్రవ్యాలు సేవించిందని పోలీసుల పరీక్షల్లో తేలింది. దాంతో ఆమెను అరెస్ట్ చేశారు. ముందు తాను అసలు ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ బుకాయించే ప్రయత్నాలు చేసింది. 

కానీ పోలీసులు ఆధారాలతో ఆమె డ్రగ్స్ తీసుకుందని బయటపెట్టడంతో ఆమె అడ్డంగా బుక్కయింది. ఇక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కానీ గురువారం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ రావడంతో బయటకు వచ్చింది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. ఆమె తరపున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.  

Related Posts