బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం.. డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ

బర్డ్‌ ఫ్లూతో తొలి మరణం.. డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరణ

కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా పక్షులకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సాధారణంగా పక్షులకు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా ప్రపంచంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఈ వేరియంట్ మనుషులకు సోకడం దాదాపు అసాధ్యంగా భావించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. అయితే బర్డ్ ఫ్లూ ఇప్పుడు పక్షులు, జంతువులతో పాటు మనుషులకూ వ్యాపిస్తోంది.

అంతేకాదు తాజాగా బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలో తొలి మరణం సంభవించింది. మెక్సికో దేశంలో హెచ్5ఎన్2 బర్డ్ ఫ్లూ వేరియంట్ బారినపడిన 25ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల మరణించినట్లు డబ్ల్యూహెచ్‌వో ధ్రువీకరించింది. జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, విరేచనాలు, కడుపులో తిప్పడం తదితర సమస్యలతో బాధపడ్డ రోగి ఏప్రిల్ 24న కన్నుమూశాడు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడిన విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. 

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

అయితే రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, మెక్సికోలోని కోళ్లల్లో  హెచ్5ఎన్2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్లు పేర్కొంది. అయితే, కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మరోవైపు, అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన కొత్త వేరియంట్ వ్యాపిస్తోంది. అయితే, ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు.

Related Posts