అంతర్జాతీయ న్యాయమూర్తుల సెమినార్ విజయవంతం

  • ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ
  • మూడు రోజుల పాటు కొనసాగిన సెమినార్ 

WhatsApp Image 2024-06-23 at 5.48.55 PM (1)

ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ న్యాయమూర్తుల సెమినార్‌ 2024ను హైదరాబాద్‌లో మూడురోజులపాటు విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక సెమినార్ జూన్ 21 నుంచి జూన్ 23 వరకు లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే VSM, కమాండెంట్ MCEME, కల్నల్ కమాండెంట్ కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ మరియు కమోడోర్ ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ నేతృత్వంలో నిర్వహించబడింది.ఈ సెమినార్‌లో ప్రపంచ స్థాయి బోధకులుక్రిస్ వాట్స్ (GBR)రూట్ సబ్‌నిరన్ (థాయ్‌లాండ్)లియోనార్డ్ చిన్ (మలేషియా)  పోక్‌పాంగ్ (థాయ్‌లాండ్), ఇతర ప్రముఖ అంతర్జాతీయ బోధకులు పాల్గొన్నారు. సెయిలింగ్ జడ్జింగ్‌లో తాజా నియమాలు, నిబంధనలు, ఉత్తమ పద్ధతులపై సమగ్ర సెషన్‌లు నిర్వహించారు. ఈ సెమినార్ ద్వారా న్యాయమూర్తుల నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని పెంపొందించడం, వారు సెయిలింగ్ పోటీల్లో అత్యున్నత స్థాయిలలో అఫీషియేట్ చేయడానికి సన్నద్ధం అవడానికి ఉపయోగపడుతుంది .WhatsApp Image 2024-06-23 at 5.48.55 PM

Read More  కుమారుని స్నాతకోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

 

సెమినార్ ప్రాముఖ్యత

ఈ సెమినార్ భారతీయ సెయిలింగ్ కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ పేర్కొంది. ఇది వరల్డ్ సెయిలింగ్ ద్వారా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆమోదాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ సెమినార్ ద్వారా  అంతర్జాతీయ వేదికపై ఈఎంఈ సెయిలింగ్‌ అసోసియేషన్‌ యొక్క ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచింది. ఈ సెమినార్ ద్వారా న్యాయమూర్తులు ఆతిథ్యం ఇవ్వడం తమకు మరింత గౌరవంగా ఉందని, దేశంలో నౌకాయానానికి ఇది ఒక ముందడుగు అవుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. 

WhatsApp Image 2024-06-23 at 5.48.56 PM