నటుడు పృథ్వీరాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌

నటుడు పృథ్వీరాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌

సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కేసు వేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కేసు వేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన కోర్టుకు గైర్హాజరు అవుతుండటంతో ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా, భార్య శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలను పాటించని పృథ్వీ  హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది.

మరోవైపు హైకోర్టు ఆదేశాలను పృథ్వీరాజ్ పాటించలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఓ దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని శ్రీలక్ష్మి తరపు లాయర్లు పిటిషన్‌లో వెల్లడించారు. కాగా, పిటిషన్‌ను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు జడ్జి.. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు.

Related Posts