Flash: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. హేమ ఫొటో లీక్..!

Flash: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. హేమ ఫొటో లీక్..!

హేమ వీడియో బైట్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బెంగళూరు పోలీసులు హేమను తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బైట్ రిలీజ్ చేసిందో ఆ వీడియో బైట్‌లో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండడం గమనార్హం.

బెంగళూరులో ఆదివారం రాత్రి రేవ్‌ పార్టీకి సంబంధించి ఉదయం నుంచి టాలీవుడ్ నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో హేమ ఓ వీడియోను విడుదల చేస్తూ బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని తెలిపింది. అనవసరంగా తన పేరును లాగొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. 

హేమ వీడియో బైట్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బెంగళూరు పోలీసులు హేమను తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బైట్ రిలీజ్ చేసిందో ఆ వీడియో బైట్‌లో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండడం గమనార్హం. అయితే హేమ నిజంగానే బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉందా? లేక పోలీసులు అదుపులోకి తీసుకుని పూచికత్తు మీద విడిచి పెట్టారా? అనేది తెలియాల్సివుంది. అలా జరిగినా తనకు ఆ పార్టీతో సంబంధం లేదని ఎందుకు చెబుతోంది? అనే అంశాల చుట్టూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా, ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామాహౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లు సమాచారం. పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 20మందికి పైగా యువతులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది కానీ.. ఆయన నిన్న హైదరాబాదులోనే ఉన్నట్లు సమాచారం.

Related Posts