డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న పవన్.. ఇండియా టుడే ఇంటర్వ్యూలో వెల్లడి

డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న పవన్.. ఇండియా టుడే ఇంటర్వ్యూలో వెల్లడి

 

ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ సొంతంగానే మెజార్టీ సీట్లను సాధించుకుంది. కానీ కూటమి విజయంలో పవన్ కల్యాణ్‌ కీలకంగా వ్యవహరించారు. పవన్ ఇమేజ్ వల్లే కూటమి గెలిచిందనే ప్రచారం బలంగా ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కూటమి నుంచి సీఎం కాబోతున్నారు. 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

దాంతో పవన్ కల్యణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి ఖాయం అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా ఇండియా టుడే వెల్లడించింది. నిన్న అంటే ఆదివారం పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో.. డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. 

అదే విషయాన్ని ఇండియా టుడే వెల్లడించింది. ఈ నెల 12న ఏపీ కొత్త సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. అయితే ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు, డిప్యూటీ సీఎం ఎవరికి అనే దానిపై మంగళవారం నాడు ఎన్డీయే కూటమి సమావేశంలో క్లారిటీ రాబోతోంది. చూస్తుంటే కచ్చితంగా పవన్ కల్యాణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts