ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరడంతో అధికారుల బదిలీల్లో మార్పులు తప్పట్లేదు. ఇక తాజాగా ఏపీలో భారీగా ఐఏఎస్ లను బదిలీలు చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. అలాగే స్కూల్స్ కార్యదర్శిగా కోన శ్రీధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్టీఏ కమిషనర్ గా కాటమనేని భాసకర్ నియమితులు అయ్యారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది.
అయితే పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‍లను జీఏడీక అటాచ్ చేశారు. ఈ మేరకు వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు.