చరిత్ర సృష్టించిన లోకేష్..
- మంగళగిరిలో విజయఢంకా
- అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువగళం
- పప్పు కాదు.. నిప్పు అంటూ నిరూపించిన లోకేష్
విశ్వంభర, మంగళగిరి : నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. ఏపీ రాజకీయాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. దశాబ్దాలుగా టీడీపీకి దక్కని సీటును తన సొంతం చేసుకున్నారు. మంగళగిరిలో విజయఢంకా మోగించారు నారా లోకేష్. దాదాపు 36వేలకు పైగా ఓట్ల తేడాతో తన సమీప అభ్యర్థి లావణ్యపై ఆయన విజయం సాధించారు. ఇక్కడ 1985 నుంచి ఇప్పటి వరకు టీడీపీ గెలవలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి నారా లోకేష్ పోటీ చేశారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. అక్కడే ఉంటూ సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. అదే ఆయనకు ప్లస్ అయిపోయింది. దాంతో ప్రజల్లో ఆయనపట్ల సానుకూలత బాగా పెరిగింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు భారీగా మెజార్టీ సొంతం అయిందని చెబుతున్నారు. దాంతో తమ యువ నాయకుడు చరిత్ర సృష్టించారని టీడీపీ నేతలు సంబురాల్లో మునిగితేలారు. ఇన్ని రోజులు పప్పు అంటూ ఎగతాళి చేసిన వైసీపీకి.. పప్పు కాదు నిప్పు అంటూ నిరూపించారని అంటున్నారు టీడీపీ నేతలు.