రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!

రామోజీ మృతిపట్ల జగన్, కేటీఆర్ సంతాపం..!

మీడియా దిగ్గజం, రామోజీ గ్రూప్ సంస్థల అధినేత అయిన రామోజీరావు కొద్ది సేపటి క్రితమే అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. ఈ క్రమంలోనే ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా నివాలి అర్పిస్తున్నారు. 

ఇందులో భాగంగా సీఎం జగన్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఈ విధంగా పోస్టు చేశారు.. రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.  రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Read More మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

ఇక బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామోజీ మరణంపై ట్వీట్ చేశారు. మీడియా దిగ్గజం, నిజమైన దార్శనికుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. రామోజీ గారు స్వీయ నిర్మితమైన వ్యక్తి, ఆయన కథ స్ఫూర్తిదాయకం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గొప్ప విజయాన్ని ఎలా సాధించవచ్చో చెప్పడానికి ఆయన జీవితం, ప్రయాణం నిదర్శనం. తెలుగు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు.

అతను చాలా ఆప్యాయంగా మరియు ఆప్యాయంగా ఉండే వ్యక్తి, అతనితో గత దశాబ్దంలో అనేకసార్లు సంభాషించే అవకాశం నాకు లభించింది. అతని దయగల మాటలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను మరియు పెద్ద మనిషి శాంతించాలని ఆశిస్తున్నాను అంటూ సంతాపం తెలిపారు.