కాసేపట్లో చంద్రబాబుతో కేసీ వేణుగోపాల్ భేటీ ? ఇండియా కూటమి తరుఫున చర్చలు

కాసేపట్లో చంద్రబాబుతో కేసీ వేణుగోపాల్ భేటీ ? ఇండియా కూటమి తరుఫున చర్చలు

చంద్రబాబు ఇంటికి ఇండియా కూటమి నేతలు?

ఎన్టీఏకు సీట్లు తగ్గిన నేపథ్యంలో బాబుతో చర్చలు?

జాతీయ మీడియాలోనూ చంద్రబాబుపై చర్చలు

విశ్వంభర, విజయవాడ: మోడీ 3.0కి బ్రేక్ పడేలా ఫలితాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 400 లోక్ సభ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసి మూడోసారి అధికారం చేపడుతామని ప్రధాని మోడీ సహ బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 299 స్థానాల వద్దే లాక్ కాగా, ఇండియా కూటమి 244 స్థానాల్లో మెజార్టీ కొనసాగుతోంది. ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.  ఈ క్రమంలో బీజేపీ తిరిగి  సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. మిత్రులపై తప్పనిసరిగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 

చంద్రబాబుపై జాతీయ మీడియా ఫోకస్

ఈ క్రమంలోనే చంద్రబాబు పాత్రపై జాతీయ మీడియాలో చర్చ కొనసాగుతోంది. చంద్రబాబు కేంద్రంలో మళ్లీ కింగ్ మేకర్ అయ్యే అవకాశముందని జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇండియా కూటమి 250 సీట్ల వద్ద ఆగిపోతే తదుపరి ప్రభుత్వం సహా ప్రధాన మంత్రిని నిర్ణయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించవచ్చని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.  చంద్రబాబు తన డిమాండ్లను సాధించుకొని ఒక వేళ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపితే ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

ఇండియా కూటమిలోకి చంద్రబాబు?

మరోవైపు చంద్రబాబుతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ  కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ మేజిక్ ఫిగర్ కు దూరంగా ఉండడంతో ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపేందుకు కేసీ వేణుగోపాల్, మమత బెనర్జీ రెడీ అవుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నారు. ఇవాళ చంద్రబాబును కేసీ వేణుగోపాల్, నవీన్ పట్నాయక్‌ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భేటీ కానున్నారు. ఇండియా కూటమిని అధికార పీఠంపై కూర్చోబెట్టేలా వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నేషనల్ పాలిటిక్స్‌లో కింగ్ మేకర్ అయ్యే చాన్స్ లేకపోలేదు. 

 

Related Posts