మూడో భార్యకు ఆస్తి మొత్తం రాసిస్తాడనే నేపథ్యంలోనే హత్య..
ఆస్తి కోసమే హత్య..
బాడీగార్డ్ బాబాకు సుపారి
పాషవికంగా కమ్మరి కృష్ణ మర్డర్
మీడియా సమావేశంలో శంషాబాద్ డిసిపి రాజేష్
విశ్వంభర న్యూస్ రంగారెడ్డి జిల్లా :- షాద్ నగర్ ఏసిపి కార్యాలయంలో హత్యకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ రాజేష్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు కమ్మరి కృష్ణ చాలాకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పలు ఆస్తులు కలిగి ఉన్నాడని ఇందులో భాగంగా బండ్లగూడలోని కేకే కన్వెన్షన్, కమ్మదానం లోని కేకే ఫామ్ హౌస్ ఉందని, అయితే మృతుడు కృష్ణ మొదటి భార్య ఆమె పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకొని ఆవిడ మరణించిన తదుపరి మూడో వివాహం చేసుకున్నాడని తెలిపారు.మూడో వివాహం చేసుకున్న పావని కి 16 నెలలు కుమార్తె జన్మించింది.. మూడవ భార్య పేరిట దాదాపు 16 కోట్ల విలువచేసే టెన్ మోర్ బిల్డింగ్, కేకే బిల్డింగ్ లను రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు.. అయితే ఆస్తి విషయంలో మొదటి భార్య పెద్దకొడుకు శివ కృష్ణతో గొడవపడ్డాడని, కృష్ణను ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం రాసి ఇష్టడానే ఉద్ధేశ్యంతో ఎలాగైనా కృష్ణ ను చంపాలని ప్లాన్ వేశాడని తెలిపారు.
ఎలాగైనా తన కృష్ణను చంపాలని ప్లాన్ వేసిన కొడుకు శివకుమార్ కృష్ణ వద్ద పని చేసే అంగరక్షకుడు బాబా కు 25 లక్షలు,ఒక ఇల్లు ఇస్తానని ఆశ చూపాడు.ఇందుకు అంగీకరించిన బాబా రెండు లక్షలు తీసుకొని ఈ నెల 10 వ తేదిన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బాబా ,జీలకర్ర గణేష్ ఆలియస్ లడ్డు,ఇంకొక వ్యక్తి తో కలిసి కమ్మదనం లోని కేకే ఫార్మ్స్ కు చేరుకొని జీలకర్ర గణేష్,ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి కమ్మరి కృష్ణ చేతులు వెనకకు పట్టుకోవడంతో బాబా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అతి క్రూరంగా గొంతు కోసి ,పొట్టలో పొడిచి చంపేశారని ఈ హత్య పై మృతుడు కమ్మరి కృష్ణ మూడోవ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి రెండు కార్లు,ఒక ద్వి చక్ర వాహనం,మూడు కత్తులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రాజేష్ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏసిపి రంగస్వామి,సీఐ లు విజయ్ కుమార్,రాంరెడ్డి తదితరులున్నారు.