తెలంగాణలో పెరిగిన ఓటింగ్ శాతం.. ఏ పార్టీకి అనుకూలంగా మారనుంది?
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పలు రాష్ట్రాలలో మే 13వ తేదీ ప్రశాంతంగా ముగిసాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల వాతావరణం నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అయితే తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగిన సంగతి తెలిసిందే. ఐదు నెలల క్రితం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఈ క్రమంలోనే ఆమె 13వ తేదీ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తమదే విజయం అంటూ హస్తం నేతలు చెబుతున్నారు. అయితే పోలింగ్ శాతం చూస్తే కనుక అన్ని పార్టీ నేతలలో గుబులు మొదలైందని చెప్పాలి అయితే ఎన్నడు లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది.2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ దాదాపు 70శాతం వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అయితే పోలింగ్ శాతం గురించి ఇంకా ఈసీ అధికారకంగా వెల్లడించలేదు. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి కష్టమనే చెప్పాలి మరి తెలంగాణలో పెరిగిన ఈ ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా మారింది? ఏ పార్టీకి ఇబ్బందికరంగా మారనుంది అనేది తెలియాల్సి ఉంది.