సీఎం రేవంత్ రెడ్డి చుక్కా రామయ్యను కలవడానికి కారణం ఇదే..!

సీఎం రేవంత్ రెడ్డి చుక్కా రామయ్యను కలవడానికి కారణం ఇదే..!

విశ్వంభర, అంబర్ పేట: విద్యావేత్త,మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్యను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం విద్యానగర్ లోని రామయ్య ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని మర్యాదపూర్వకంగా కోరారు.ఈ సందర్భంగా చుక్కారామయ్యను సీఎం  శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. నిండు నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా జీవించాలని ఆకాంక్షించారు. సీఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, యువజన కాంగ్రెస్ నాయకులు మోత రోహిత్ తదితరులు ఉన్నారు.