కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?

'గాడిద గుడ్డు' అంటూ హైదరాబాద్ లో వెలిసిన పోస్టర్లు.

WhatsApp Image 2024-07-24 at 17.34.31_3c542028

విశ్వంభరా, హైదరాబాద్ : - కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హైదరాబాద్లో పోస్టర్లు కలకలం రేపాయి. 'బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది? గాడిద గుడ్డు' అంటూ అనేక ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది తెలియాల్సి ఉంది. కాగా బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై మండిపడుతున్న విషయం తెలిసిందే

Read More మహిళా విభాగ్ అధ్యక్షరాలికి బుక్కా ఈశ్వరయ్య అభినందనలు