మేడిగడ్డకు జలకళ

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. 

WhatsApp Image 2024-07-19 at 11.55.19_b212b5aa

విశ్వంభర భూపాలపల్లి జూలై 19 :-   గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మహాదేవపూర్ మండలంలోని పెద్దంపేట వాగు, ఎడపల్లి వాగు ప్రవాహాలు ఉదృతంగా ఉండటంతో రాకపోకలు స్తంభించాయి. కాటారం మండలంలో ఒక వాగులో బొలెరో వాహనం కొట్టుకుపోగా డ్రైవర్ను స్థానికులు కాపాడారు. మేడిగడ్డ కు వరద నీరు వచ్చి చేరుతుండటంతో 85 గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు.1, 93,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా మొత్తం నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. కాలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుత నీటిమట్టం 8 మీటర్లుగా ఉండగా నీటిమట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 76.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదముగా జిల్లాలో అత్యధికంగా కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. స్థానికంగా మండల తహసీల్దారులు, గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల ఈ భారీ వర్షాల వల్ల గోడలు ,ఇండ్లు కూలి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలేశ్వరం ప్రధాన ఘాటు వద్ద స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతూ భక్తులు ఎక్కువ లోతుకు వెళ్లకుండా స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు.

Read More జాబ్ మేళాలో 14 మంది ఎంపిక