స్వచ్ఛందంగా బెల్ట్ షాప్స్ మూసివేత - హర్షం వ్యక్తం చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గ పల్లెల్లో ఫలిస్తున్న వ్యూహం
బెల్ట్ షాపులను మూసివేస్తున్నామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న నిర్వాహకులు
స్వచ్ఛందంగా మూసివేస్తున్న నిర్వాహకులను అభినందించి సన్మానించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హర్షతిరేకాలు వ్యక్తం చేస్తున్న మహిళలు
పల్లెల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపే ఆరోగ్య వాతావరణం వైపు అడుగులు
విశ్వంభర, మునుగోడు నియోజకవర్గం : మార్పు మొదలైంది.. క్రమక్రమంగా బెల్ట్ షాపులను తామే మూసివేస్తామంటూ ముందుకు వస్తున్నారు నిర్వాహకులు.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటినుండి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని పెద్ద ఉద్యమాన్నే చేపట్టారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. గ్రామాల్లోని ప్రతి బూత్ లో మహిళలు పురుషులతో కలిసి బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీలు వేసారు.. ఆ కమిటీల ద్వారా గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడి మద్యం అమ్మకాన్ని అరికట్టాలని నిర్దేశించారు. శాసనసభ్యుడు ఆదేశాల మేరకు బెల్ట్ షాపు నిర్మూలన కమిటీలు గ్రామాలలో మద్యం అమ్మకాన్ని అరికడుతున్నారు.మునుగోడు నియోజకవర్గంలో ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడానికి, సమాజ శ్రేయస్సు కోసం రాజగోపాల్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఫలితాలను ఇస్తుంది. రాజ్ గోపాల్ రెడ్డి మాటలను ప్రజలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. బెల్ట్ షాపులు నిర్వహించే నిర్వాహకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెల్ట్ షాపులను మూసివేస్తున్నారు... మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన బోయినపల్లి శంకరయ్య, బోయినపల్లి వెంకన్నలు దశాబ్ద కాలం నుండి గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారు. శాసన సభ్యుడు మునుగోడు ప్రజల కోసం చేస్తున్న ఈ మంచి కార్యానికి తమ మద్దతు ఇస్తూ బెల్ట్ షాపులను స్వచ్ఛందంగా మూసేశారు... బెల్ట్ షాపులో స్వచ్ఛందంగా మూసివేసిన శంకరయ్య, వెంకన్నలను అభినందించి సన్మానించారు ఎమ్మెల్యే. ఈ ప్రయత్నంలో నాపై వ్యతిరేకత వచ్చినా కూడా వెనక్కి తగ్గనని తేల్చి చెప్పారు.. నియోజకవర్గంలోని 159 గ్రామాలలో ప్రతి బూతులో బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీలు ఇప్పటికే పూర్తయ్యాయని... ఇవే కమిటీల ద్వారా గ్రామాల అభివృద్ధి చేపడతామని తెలిపారు... ఊకొండి గ్రామానికి చెందిన శంకరయ్య, వెంకన్నల లాగానే బెల్ట్ షాపులు నిర్వహించే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నామని ముందుకు రావాలని పిలుపునిచ్చారు...