బెల్ట్ షాపుల నిర్మూలనకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు

బెల్ట్ షాపుల నిర్మూలనకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు

 బెల్ట్ షాపులు నిర్మూలించిన  గ్రామాలకు వెంటనే 10 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యే
 
 రాజగోపాల్ రెడ్డి  తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు 
 
 మీ వల్ల గ్రామాల్లో తాగకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారు అంటూ ఎమ్మెల్యేకి మహిళల కితాబు 

విశ్వంభర, మునుగోడు నియోజక వర్గం : ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు తాగుడు ఆలోచన మానుకోవాలని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా  బెల్ట్ షాపులను నిర్మూలించాలని  మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆలోచనకు ఆచరణకు గ్రామాలకు గ్రామాలే కదిలి వస్తున్నాయి. గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్మూలన కమిటీలు నిర్వహించుకుని బెల్ట్ షాపులు నిర్వహించకుండా చూస్తున్నారు గ్రామస్తులు...బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధికి  నిధులు మంజూరు చేస్తున్నారు ఎమ్మెల్యే...మునుగోడు మండలం రావి గూడెంలో బెల్ట్ షాపులు నిర్మూలించినందుకు కమిటీ సభ్యులను మునుగోడు లోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు.. వెంటనే రావి గూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరు చేశారు... బెల్ట్ షాపులను నిర్మూలించిన కమిటీ మెంబర్లైన మహిళల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు... మీరు తీసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకుంటున్నారని తాగుడు జోలికే వెళ్లట్లేదని ఆనందం వ్యక్తం చేశారు... గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండడంవల్ల యువత మద్యానికి బానిసై చెడు వైపు వెళ్తున్నారని కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని  ఆవేదన వ్యక్తం చేశారు.. ఎట్టి పరిస్థితులలో బెల్ట్ షాపులు మూసివేయాల్సిందేనని, ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరికట్టాల్సిందేనని తేల్చి చెప్పారు...

Tags: