మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు మృతి

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు మృతి

విశ్వంభర, భద్రాచలం :  మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మావోయిస్టులు పాతిన ఐఈడీ మందు పాతరను, ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెలికి తీసే ప్రయత్నం చేయడంతో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఐఈడీ బాంబు విస్ఫోటనానికి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

 

Read More కరకట్ట నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి:గ్రామసభలో సీపీఎం డిమాండ్