టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

టీయూడబ్ల్యూజె రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

 

రాష్ట్ర అధ్యక్షుడిగా విరాహత్ అలీ
ప్రధాన కార్యదర్శిగా రాం నారాయణ

 

 

టీయూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గురువారం మహాసభ నిర్వహించగా.. ఇందులో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలోనే రాష్ట్ర అధ్యక్షుడిగా కె.విరాహత్ అలీని ఎన్నుకున్నారు. కాబట్టి ఖమ్మంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభల్లో మిగిలిన కమిటీని ఎన్నుకున్నారు. 

Read More హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర

ఇందులో భాగంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె. రాం నారాయణ ఎన్నికయ్యారు. ముగ్గురు ఉపాధ్యక్షులను, ముగ్గురిని కార్యదర్శులుగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా 16 మందిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు గాడిపల్లి మధు (వరంగల్), ఎంఏకె ఫైసల్(సంగారెడ్డి), బి.సంపత్‌కుమార్(పెద్దపల్లి)ని ఎన్నుకున్నారు.

ఇక కార్యదర్శులుగా కె.శ్రీకాంత్‌రెడ్డి(రంగారెడ్డి), జి.మధుగౌడ్(వనపర్తి), వి.యాదగిరి(హైదరాబాద్) ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎం.వెంకట్‌రెడ్డి (మేడ్చల్), కార్యవర్గసభ్యులుగా ఎం.వేణుగోపాలరావు(ఖమ్మం), పి.వేణుమాధవరావు (హన్మంకొండ), ఆర్.ప్రకాష్‌రెడ్డి(మంచిర్యాల), ఎం.కర్ణయ్య(నాగర్ కర్నూల్), జి.శ్రీనివాస్‌శర్మ(మెదక్), పి.ప్రభాకర్‌రెడ్డి(నల్గొండ), సయ్యద్ అబ్దుల్ లతీఫ్(కామారెడ్డి), జె.సురేందర్‌కుమార్(జగిత్యాల), ఏ.రవీందర్(కరీంనగర్), ఏ.రాజేష్(హైదరాబాద్), కె.రాజిరెడ్డి(సిద్ధిపేట), సయ్యద్ గౌస్ మోహియుద్దీన్(హైదరాబాద్), కె.అనిల్‌కుమార్ (హైదరాబాద్), చలసాని శ్రీనివాసరావు(సూర్యాపేట), కంకనాల సంతోష్(హన్మకొండ), గుడిపెల్లి శ్రీనివాస్(రంగారెడ్డి) ఎన్నికయ్యారు.