వరంగల్ లో దారుణం.. ఫోన్ లో డాక్టర్ సలహా తీసుకుంటూ డెలివరీ చేసిన నర్సులు...బాబు మృతి

వరంగల్ లో దారుణం.. ఫోన్ లో డాక్టర్ సలహా తీసుకుంటూ డెలివరీ చేసిన నర్సులు...బాబు మృతి

విశ్వంభర,వెబ్ డెస్క్ : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళలకు ఫోన్ ద్వారా లేడీ డాక్టర్ సలహాలు , సూచనల మేరకు ఇద్దరు నర్సులు డెలివరీ చేసిన ఘటనలో మగ శిశువు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్థన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. డాక్టర్, నర్సుల నిర్లక్ష్యంతో తమ బిడ్డ చనిపోయాడు అని పోలీసులకు బిడ్డ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కథ వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామనికి చెందిన కసిరెడ్డి నరేష్ భార్య బేబీ శ్రీజ పురిటి నొప్పులతో ఈ నెల 16న వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. 17న నొప్పులు రావడంతో డెలివరీ చేయాలని నరేష్ కుటుంబ సభ్యులు డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ ని కోరారు. అయితే డాక్టర్ శ్రీజను చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 

Read More రైతుకు న్యాయం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం: ⁠కే ఎల్ ఆర్ 

ఆ తర్వాత కొద్ది సేపటికే నొప్పులు మరింత పెరగడంతో అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులు, ఏఎన్ ఎమ్ లు శ్రీజ పరిస్థితిని డాక్టర్ కు ఫోన్ లో వివరించారు. దీంతో వైద్యురాలు తను ఫోన్ లో సూచనలు ఇస్తాను డెలవరీ చేయమని చెప్పింది. దీంతో శ్రీజను లేబర్ రూం కి తీసుకెళ్లి డాక్టర్ సూచనల మేరుకు డెలివరీ చేశారు. మడశిశువు పుట్టగా... బిడ్డను తల్లికి చూపించకుండానే వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అక్కడ ఆ శిశువు చికిత్స పొందుతూ చనిపోయింది. 

తమ బిడ్డ చనిపోవడానికి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎమ్ ల నిర్లక్ష్యమే కారణమంటూ శ్రీజ భర్త నరేశ్ వర్థన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ భర్త నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా డాక్టర్ ఫోన్ లో చేస్తున్న సూచనలతో డెలివరి చేసినట్లు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎమ్ ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్సు, ఏఎన్ఎమ్ ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనేది ఉప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.