ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది : టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ 

ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది : టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ 

* బామ్మర్ది కథను సృష్టించి బద్మాష్ నాటకాలు ఆడుతున్న కేటీఆర్ 

* బామ్మర్దులను బంధువులను బాగు చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదే 

 * ప్రజల్లో సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి చవఖభారు ఆరోపణలు

 * రాజకీయ దురుద్దేశంతో రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ 

విశ్వంభర, హైదరాబాద్ : కేంద్ర పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై  తప్పుడు ఆరోపణలు చేయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. బామ్మర్ది కథను సృష్టించి కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారన్నారు. బామ్మర్దులను, బంధువులను బాగు చేసిన చరిత్ర, బీఆర్ఎస్ పార్టీదే, కేసీఆర్ , కేటీఆర్ లదే అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. గెలిపించిన ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన బీఆర్ఎస్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారు.పార్లమెంట్ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అడ్రస్ గల్లంతు చేశారు.  ఇక ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తులేదని తేలిపోవడంతో, కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.  బీఆర్ఎస్ ప్రజలకు దూరమైన ప్రభుత్వమైతే కాంగ్రెస్ ప్రజలకు దగ్గరైన ప్రభుత్వం అని గుర్తుంచుకో కేటీఆర్ అని అన్నారు.

రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నది. దీంతో  ప్రజల్లో రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చవకబారు ప్రకటనలు చేస్తున్నారుని తెలిపారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినందుకు నజరానాగా పాలమూరు రంగారెడ్డి వర్కులు ఇస్తే అవి ఆయన అల్లుడు సృజన్ రెడ్డి చేసింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే సృజన్ రెడ్డికి - కేటీఆర్ కు మధ్య  వ్యాపార సంబంధాలు ఉన్న విషయం వాస్తవం కాదా? అని చెప్పారు. కేటీఆర్ కు ఉన్న బినామీల్లో సృజన్ రెడ్డి ఒకరన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని ఆయన అన్నారు.

Read More అసెంబ్లీ నియమావళి కి  విరుద్ధం -  డా ఎర్రోళ్ల శ్రీనివాస్

అమృత్ టెండర్లలో సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్ వచ్చిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు అయితే టెండర్లు పిలిచినప్పుడు ఆర్థికంగా సాంకేతికంగా అనుభవం ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయి. స్టార్ టాప్ కంపెనీలు ఆర్థికంగా ఉండి సాంకేతిక అనుభవము లేని కారణంగా సాంకేతికంగా అనుభవం కలిగిన కంపెనీలతో జాయింట్ వెంచర్ పెట్టుకొని టెండర్ల లో పాల్గొంటారు అనే సంగతి  కేటీఆర్ కు తెలియదా అని అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ ను హెచ్చరిస్తున్నామన్నారు.అవినీతి నిరోధక చట్టం, సెక్షన్లు అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా కేటీఆర్ ఆ సెక్షన్లన్నీ మీకు మీ కుటుంబానికి వర్తిస్తాయి. మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేసే రోజు దగ్గర్లోనే ఉందిని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు 

కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని భూములను కన్వర్షన్ చేసి ఎన్ని బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చారో అందరికీ తెలుసని ఆయన చెప్పారు.ఈ అనుమతుల్లో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో, మీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడిందో చెప్పాలంటే.. ‘‘రాస్తే రామాయణం వింటే మహాభారతం అంత కథ ఉందన్నారు.

  యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మేం కోరుతున్నాం. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి చేత ఆర్కిటెక్ట్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ని అడుగుతున్నామని చెప్పారు. కేవలం జీయర్ స్వామి మెప్పుకోసం ఆనంద సాయి అనే సినిమా సెట్టింగులు వేసే వ్యక్తికి పనులు అప్పజెప్పి దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించడం అవినీతి కాదా అని ప్రశ్నించారు.యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అవకతవలపై దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆయన తెలిపారు .మీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద మీ చెల్లెలు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లింది నిజం కాదా? అని అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ రహస్య మిత్రులు అనడానికి కవితకు బెయిల్ రావడమే నిదర్శనమన్నారు. మీకు చేతనైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవండి తప్ప, సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలతో రాజకీయ పబ్బం గడుపుతామంటే ఇకపై నడవదని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.

Tags: