తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

 

తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దాంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను బట్టి మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Read More మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

వికారాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు చెట్ల కింద, కూలిపోయే ఇండ్లలో ఉండొద్దని చెబుతున్నారు.