డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడుపుతే ఊరుకునే ప్రసక్తే లేదు
మందు సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం
వికారాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ రాజు, ఏఎస్ఐ ప్రకాష్
విశ్వంభర, వికారాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే ఊరుకునే ప్రసక్తే లేదని వికారాబాద్ టౌన్ ఎస్సై సత్యనారాయణ రాజు, ఏఎస్ఐ ప్రకాష్ అన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి రోడ్డులో వికారాబాద్ టౌన్ ఎస్ఐ సత్యనారాయణ రాజు, ఎస్ఐ ప్రకాష్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్కహాల్ సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని, కుటుంబం రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు. మైనర్ లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రుల మీద కానీ, వాహనం ఇచ్చిన వారిపైన కానీ కేసులు చేయడం జరుగుతుందని, మైనర్లు వాహనాలు నడపకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. టూ వీలర్ పై ఇద్దరే ప్రయాణించాలని, అలాకాకుండా ముగ్గురు ఆపై ప్రయాణిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ప్రతి ఒక్కరు పోలీస్ వారు చెప్పిన నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని అన్నారు..