వ‌రంగా మారాల్సిన మూసీ శాపంగా మార‌కూడ‌దు:సీఎం రేవంత్‌రెడ్డి

వ‌రంగా మారాల్సిన మూసీ శాపంగా మార‌కూడ‌దు:సీఎం రేవంత్‌రెడ్డి

వ‌రంగా మారాల్సిన మూసీ శాపంగా మార‌కూడ‌దు

విశ్వంభ‌ర‌, హైదరాబాద్‌: నదులు కనుమరుగయ్యేలా చేస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజారోగ్యం, పటిష్ఠ ఆర్థిక పర్యావరణ కోణాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి. కానీ శాపంగా మిగిలిపోకూడద‌ని సీఎం సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే.. ప్రజా ప్రభుత్వ సంకల్పం అని ఆయన పేర్కొన్నారు. ఇది ఈ తరానికే కాదు.. భావితరాలకు మేలు చేసే నిర్ణయమని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి, వ్యవస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలో ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌గా ఉన్న నేపథ్యంలో విప‌క్షాలు, కొన్ని వ‌ర్గాల నుంచి భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియాలో తనదైన శైలిలో స్పందించారు.

Tags: