తెలంగాణ రాష్ట్ర స్థాయి డ్రాప్ రో బాల్ ఛాంపియన్షిప్ పోటీలు
విశ్వంభర, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలోని స్థానిక గురుకుల విద్యాపీట్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మూడవ సబ్- జూనియర్ , రెండవ జూనియర్ బాల - బాలికల డ్రాప్ రొబాల్ ఎంపిక, టోర్నమెంట్ను ఛాంపియన్షిప్ ను స్థానిక ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, గురుకుల విద్యాపీఠ్ పాఠశాలల కరస్పాండెంట్ శ్రీనివాస రావు, అలాగే తెలంగాణ డ్రాప్ రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. రహమత్ లు కొబ్బరికాయ కొట్టి , రిబ్బన్ కట్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్ పర్సన్ క్రీడాకారులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే క్రీడలు మానసిక , ఉల్లాసానికి, మరియు ఉద్యోగ - అవకాశ లు, పొందడానికి స్పోర్ట్స్ - కోటా అనేది ఎంతో తోడ్పడతాయని తెలియజేశారు. గురుకుల పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస రావు మాట్లాడుతూ చదువుతోపాటు, క్రీడలు, కూడా ఎంతో ప్రాముఖ్యం అని తెలియజేశారు. క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించవచ్చని తెలియజేశారు. ఈ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారుగా 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడ పోటీలో గెలుపొందిన క్రీడాకారులు వచ్చే జనవరి నెలలో జరిగే జాతీయస్థాయి డ్రాప్ రొ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర డ్రాప్ రొ బాల్ అసోసియేషన్, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. రహమత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ అబ్జర్వ్ కమిటీ కార్యదర్శి, ఎం.డి. అక్బర్ బాబా, రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేందర్, రంగారెడ్డి జిల్లా టెక్నికల్ అబ్సర్వ్ కమిటీ అనూష, నల్గొండ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రాము, ఇతర పి.ఈ. టి లు లింగస్వామి, తెలంగాణ రాష్ట్ర కోచ్ గౌరీ శంకర్, సుధాకర్ శ్రీను, అభిలాష్, మొదలగువారు పాల్గొన్నారు.