రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

 హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి: మహేశ్వరం కాంగ్రెస్ ఇంచార్జ్ కెఎల్ఆర్.

WhatsApp Image 2024-07-19 at 16.09.52_721cbfea

విశ్వంభరా, ఎల్బీనగర్ : - రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రుణమాఫీ చేస్తే హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవి కి 
రాజీనామా చేస్తామని ప్రగల్బాలు పలికాడని వెంటనే రాజీనామా చేయాలని
 మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కే ఎల్ ఆర్ అన్నారు. శుక్రవారం ఆర్కే పురం లోని ఎన్టీఆర్ నగర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీఎం చిత్రపటానికి క్షీరాభిషేక కార్యక్రమానికి కే ఎల్ ఆర్, టిపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి లు  హాజరూ అయ్యారు. అనంతరం కిచెన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
 రైతుల రుణమాఫీపై మాట ఇచ్చి  నిలబెట్టుకున్నామని  అన్నారు. WhatsApp Image 2024-07-19 at 16.10.23_cb776a68
  ఏకకాలంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ప్రకటించిన తేదీలోపే సంపూర్ణంగా రుణమాఫీ చేశారని అన్నారు, రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ మిత్తిలకు కూడా సరిపోలేదని, విమర్శించారు,ఈకార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పున్న గణేష్, బండి మధుసూదన్ రావు, జ్ఞానేశ్వర్ యాదవ్,కిరణ్, రమేష్ నేత, అక్బర్, లింగుస్వామి గౌడ్, దుబ్బాక శేఖర్, రాజు నాయక్,
శేఖర్ ముదిరాజ్, కళ్యాణ్, 
 పెదవూర సైదులు,మహేందర్, నబీ, శ్రీశైలం,
శ్రీకాంత్ రెడ్డి, సలీం,  పాషా, షఫీ, పటేల్, ప్రేమ్ , భాస్కర్, రవి,నాను నాయక్, నగేష్, పాండు, అనిల్,
శశి,విప్లవ, అంజిరెడ్డి, లక్ష్మీ, రేణుక, మాధవి, సంతోష, రమ,కవిత, జయశ్రీ, జయమ్మ, శ్వేత, స్వరూప, శైలజ, శానజ్ బేగం, మంగా ప్రజాప్రతినిధులు.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More అవోప ఉపాధ్యక్షుడిగా వీర బొమ్మ రమేష్