త్రాగునీటి సమస్య పై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
On
విశ్వంభర, చండూర్ : పుల్లెంల గ్రామంలో ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే మిషన్ భగీరథ SC వెంకటేశ్వర్లుతో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కారించాలని కోరారు. స్పందించిన SC , ఆర్.డబ్ల్యూ.ఎస్ AE రామచంద్రయ్య తో పుల్లెంల గ్రామంలో పర్యటించారు. ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు త్రాగునీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. త్రాగునీటి కీ శాశ్వత పరిష్కారం కావాలంటే SC కాలనీలో (OHSR) ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి. దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామని పరిష్కారం చూపుతామని తెలిపారు. వారితో పుల్లెంల మాజీ ఎంపీటీసీ సీత యాదయ్య ,కార్యదర్శి ప్రభువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. త్రాగునీటి సమస్య పై స్పందించిన ఎమ్మెల్యేకి పుల్లెంల గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు.