సూర్యాపేటలో  డ్రైనేజీ రోడ్డు నిర్మాణం లేక పారుతున్న మురుగునీరు

సూర్యాపేటలో  డ్రైనేజీ రోడ్డు నిర్మాణం లేక పారుతున్న మురుగునీరు

"ఇబ్బంది పడుతున్న 16 వార్డు ప్రజలు 
 
అధికారుల స్పందన లేదంటూ ఆవేదన
 
అడవుల్లో ఉన్నామా? మున్సిపాలిటీ పరిధిలో ఉన్నావా ?
 
కనీస వససుతులు కల్పించరా అంటూ నిలదీత

విశ్వంభర, సూర్యాపేట : మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఆంజనేయస్వామి గుడి వెనుక బజారులో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికినీరు రోడ్లపై పారుతుంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మురికి నీరు రోడ్డుపైనే నిల్వ ఉండటంతో చుట్టూ పక్కన నివసిస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురికినీరు రోడ్డుపైనే నిలుస్తుండడంతో పరిసరాలు దుర్గంధభరితంగా మారుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలి అనారోగ్యాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయనీ పట్టించుకోని నాధుడే కరువయ్యాడని మండి పడ్డారు. మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ నిర్మాణం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు అదేవిధంగా రోడ్డు నిర్మాణం లేకపోవడంతో ఏక్కడ నీరు అక్కడ నిలిచిపోతుందని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ పై ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసిన కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ , రోడ్డు నిర్మాణం చేపట్టి అంటూ వ్యాధుల బారి నుండి కాపాడలని కోరుతున్నారు.
 
ఎంగిలి బతుకమ్మ రోజున వర్షపు నీటిలో కొట్టుకుపోయిన చిన్నారి
 
ఎంగిలి బతుకమ్మ పండుగ రోజు భారీ వర్షం కురవగా ఆ భారీ వర్షానికి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతోభారీగా వరద నీరు రోడ్డుమీద కాలువల ప్రవహించిందని తెలిపారు.. ఆ వరదలో ఓ బాలుడు కొట్టుకుపోతుండుగా కాపాడినట్లు తెలిపారు..
 
మున్సిపాలిటీ పన్ను కట్టాలి కానీ వసతులు ఉండవు
 
మున్సిపాలిటీ పన్ను , నల్ల బిల్లు కరెంట్ బిల్లు అన్ని కడుతున్న సరైన వసతులు మాత్రం కల్పించడం లేదని ఆరోపించారు. ఇకనైనా అధికార యంత్రాంగం చొరవ చూపి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ వార్డు ప్రజలు గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు, తోట యాదయ్య, చింత కృష్ణయ్య, మూల రమేష్, బోయినపల్లి సోమేశ్వరం, వెన్న మాధవి, మూల ఉపేందర్, రమణ  తదితరులు కోరారు..
 

Tags: