చండూరులోని  సన్ షైన్ హైస్కూల్ స్వచ్ఛతా  హి సేవ  అవగాహన కార్యక్రమం

చండూరులోని  సన్ షైన్ హైస్కూల్ స్వచ్ఛతా  హి సేవ  అవగాహన కార్యక్రమం

విశ్వంభర, చండూర్ : స్వచ్ఛ-భారత్ స్వచ్ఛ-తెలంగాణలో భాగంగా స్థానిక చండూరు మున్సిపాలిటీలోని సన్ షైన్ హై స్కూల్  లో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛతా హి సేవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతి స్నిఖిత, ద్వితీయ బహుమతి పార్ధు నందిని సాధించారు.WhatsApp Image 2024-09-28 at 17.28.43 ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ  విద్యార్థినీ, విద్యార్థులకు స్వచ్ఛత, పరిశుభ్రత, పచ్చదనము గురించి వివరించారు. మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండడం ద్వారా మన మనసు కూడా స్వచ్ఛంగా ఉండి మన పెరుగుదలకు , ఉన్నత స్థాయికి వెళ్లడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భారతదేశాన్ని స్వచ్ఛభారత్ గా మార్చుతామని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా విద్యార్థులందరూ కలిసి భారతదేశ ఆకారంలో స్వచ్ఛత హీ సేవ‌  (S H S) అక్షరమాల ఆకారంలో ఆసీనులైనారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా,  ప్రిన్సిపాల్ రవి కాంత్,  మున్సిపాలిటీ అధికారులు అరవింద్, యాదయ్య, విజయలక్ష్మి ,  లతీఫ్ పాషా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: