కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు

కవితకు మరోసారి షాక్.. కస్టడీ పొడిగింపు

 

Read More జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి

 

Read More జిల్లాను లెప్రసి రహిత జిల్లాగా ప్రకటించాలి

ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దాంతో ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. ఆమె కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు ఈడీ అధికారులు. కాగా ఆమెకు బెయిల్ వస్తుందని ఆశపడింది. 

కానీ ఈ సారి కూడా చుక్కెదురు అయిపోయింది. ఆమె కస్టడీని జులై 7వరకు పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఇంకో 16 రోజుల పాటు ఆమె జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఓ వైపు అరవింద్ కేజ్రీవాల్ కు కూడా బెయిల్ వచ్చినా.. హైకోర్టు దాన్ని రద్దు చేసింది. 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని.. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు చేతులు మారాయని ఈడీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా ఈ కేసులో ప్రధాన నిందితురాలు కవితే అని.. ఆమెను బయటకు పంపిస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పదే పదే చెబుతోంది. కాబట్టి ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు.