సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు ఎంపీడీవో బనిసిలాల్ డాక్టర్ స్రవంతి

WhatsApp Image 2024-07-22 at 15.31.22_bf56f338
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - సోమవారం ఫరూక్ నగర్ మండల్ ఎంపీడీవో సమావేశం మందిర్ హాలులో, ఎంపీడీవో బనిసిలాల్  ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండలంలోని అన్ని గ్రామాలలోని స్పెషల్ ఆఫీసర్లకు,విలేజ్ సెక్రటరీలకు,ఏఎన్ఎం లకు మరియు హెల్త్ సూపర్వైజర్లకు సీజనల్ వ్యాధుల పట్ల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు ఈగలు మరియు దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు అని చెప్పారు. మన ఇల్లు మరియు ఇళ్ల చుట్టుప్రక్కల పరిసరాలలో ఈగలు మరియు దోమలు అనాఫిలిస్ దోమ,  క్యూలెక్స్ దోమ,  ఎడిస్ దోమ మరియు ఆర్మీ జీరస్ వంటి ఆడదోమలు పెరుగుతాయి అని తెలియజేశారు. ఈ దోమల వలన  మలేరియా, ఫైలేరియా (బోద వ్యాధి) మెదడు వ్యాపు వ్యాధి,  డెంగూ జ్వరం మరియు చికెన్ గునియా ఒంటివ్యాధులను ప్రబలుతాయని చెప్పారు. 
 మలేరియా:-ఈ వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వలన వస్తుందని తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణాలు చలి , వణుకుతో కూడిన విపరీతమైన జ్వరము మరియు తలనొప్పి వస్తుందని చెప్పారు. మలేరియాకు సరైన నిర్ధారణ మరియు చికిత్స లేకపోతే నెలల తరబడి బాధిస్తుందని చెప్పారు. మలేరియా లక్షణాలు కనిపించిన వ్యక్తికి వెంటనే రక్త నమోనాలు సేకరించి వారికి తగిన చికిత్స ఇచ్చినట్లయితే మలేరియాను అరికట్టవచ్చని తెలియజేశారు. 
 *ఫైలేరియాసిస్ (బోద వ్యాధి )
ఈ వ్యాధి క్యూలెక్స్ దోమ కుట్టడం వలన వ్యాపిస్తుందని జె.శ్రీనివాసులు తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణాలు తరచూ వచ్చే జ్వరము,  సంకల్లో , గజ్జల్లో గడ్డలు కట్టడం,  చిన్నవాపుతో మొదలై క్రమేనా శరీరములోని అవయవాల వాపు కు దారితీస్తుంది. ప్రత్యేకించి కాళ్లు,  చేతులు,  స్థనాలు,  వరబీజము,  బుడ్డా,  జననేంద్రియాలు  పాడవటం ఈ వ్యాధి యొక్క  ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి బారిన పడకుండా దోమలు పుట్టకుండా చూసుకోవడం మరియు సంవత్సరమునకు ఒక మోతాదు డీ.ఈ.సీ మాత్రలు వాడటం అని చెప్పారు.డెంగూ జ్వరం:-ఈ వ్యాధి ఏడిస్  దోమ కుట్టడం వలన డెంగు జ్వరం వస్తుందని తెలియజేశారు. ఈ వ్యాధి లక్షణాలు అకస్మాత్తుగా వచ్చే ఎముకలు,  కండరాలు , కీళ్ల నొప్పులతో కూడిన తీవ్ర జ్వరం, తగ్గినట్టుగా అనిపించి వారం , పది రోజుల్లో తిరగబెట్టి మళ్లీ జ్వరం వస్తుంది, అప్పుడు కండ్ల నొప్పి,  శరీరంపై చిన్నపాటి దద్దుర్లు (రాష్) మరియు చిగుళ్ళు నుండి,  ముక్కు , మలం ద్వారా రక్తం పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను డెంగు హిమరేజ్ అంటారు. ఈ వ్యాధి కొన్ని పరిస్థితుల్లో వ్యాధి అప్పర్ అపస్మారక స్థితికి చేరి , ప్రాణాంతకంగా మారుతుంది అని తెలియజేశారు. WhatsApp Image 2024-07-22 at 15.31.14_9a6d0652
 చికెన్ గున్యా :-ఈ వ్యాధి లక్షణాలన్నీ డెంగ్యూ వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి . కానీ ఈ వ్యాధిలో రక్తస్రావం మాత్రం ఉండదు. దోమల నివారణ చర్యలు దోమలు కుట్టకుండా రక్షణ పొందడం దోమల పెరుగుదలను అరికట్టడం దోమతెరలు వాడటం, కర్టెన్లు, జాలీలు వాడటం దోమలను పారద్రోలు పరికరాలను ఉపయోగించటం దోమలను చంపే క్రీములు,  స్ప్రేలు వాడటం రసాయనలతో పొగ పెట్టడం (ఫాగింగ్)ఇండ్లలో మందులు చల్లడం దోమలు కుట్టకుండా శరీరమునకు ఫుల్లుగా దుస్తులు ధరించడం దోమలు పెరగకుండా నివారణ చర్యలుదోమలు పెరుగు ప్రదేశాలను గుర్తించడం , వాటిని తొలగించడం ప్రతి శుక్రవారం ఫ్రైడే- ఫ్రైడే పాటించడం ఇండ్ల చుట్టూ ప్రక్కల చెత్త,  చెదారం,మురుగు కాలువలు చేరకుండా చూసుకోవడం మురుగు కాలువలలో (మోరీలు) పూడిక తీసి నీరు పారేలా చూడటం.కంప చెట్లను పిచ్చి మొక్కలను తొలగించడం 
వారానికి ఒకసారి సాయంత్రం ఫాగింగ్ చేయడం పెంట కుప్పలను,  చెత్తచెదారాన్ని తరచు తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రం  పాటించడంఇండ్ల ఆవరణలోని పనికిరాని వస్తువులలో నీరు నిల్వ కాకుండా వాటిని తొలగించడం మొదలగు చర్యలు పాటించినట్లయితే దోమలు పెరగకుండా చూడవచ్చని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తెలియజేశారు. 
తదుపరి డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ ఈగల వలన వాంతులు,విరేచనాలు కలుగుతాయి అని,  వర్షాకాలంలో ఇండ్లలో తినుబండారాలపైన మూతలు ఉంచాలి అని,ఈగలు వాలిన ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాంతులు,విరేచనాలు అవుతాయని చెప్పారు .ఒక మనిషికి నాలుగు లేదా ఐదు సార్లు వాంతులు,విరేచనాలు అయినట్లయితే అతని శరీరంలోని నీటి శాతం మొత్తం కోల్పోయి,అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి,  చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ స్రవంతి చెప్పారు. ఒకటి రెండుసార్లు వాంతులు విరేచనాలు అయిన వెంటనే మా ఆరోగ్య సిబ్బంది దగ్గర ఉండే  ఓ.ఆర్.ఎస్ పాకెట్  తీసుకుని ఒక లీటర్ నీళ్లు వేడి చేసి చల్లార్చి అందులో కలుపుకొని కొద్ది కొద్దిగా ఆ నీటిని సేవించాలని చెప్పారు . అలా సేవించడం వల్ల మన శరీరంలో కోల్పోయిన లవణాలను మళ్లీ తిరిగి పొందవచ్చని తెలియజేశారు. మీకు సమయానికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్టు లభ్యము కాని ఎడల,  ఓ.ఆర్.ఎస్ ద్రావణాన్ని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు అని చెప్పారు . అది ఎలా అనగా ఇంట్లో ఒక పాత్రలో నీటిని మరిగించి చల్లార్చి ఒక గ్లాస్ నిండా నీళ్లను తీసుకొని,ఆ గ్లాసులో ఒక స్పూను చక్కెర,  చిటికెడు ఉప్పు మరియు ఐదు చుక్కల నిమ్మరసాని కలిపినట్లయితే  ఓ ఆర్ ఎస్  ద్రావణం తయారవుతుందని,  అలాంటి ద్రావణాన్ని తీసుకున్నట్లయితే వాంతులు విరేచనాలలో కోల్పోయిన లవణాలను వెంటనే మనము పొందవచ్చని తెలియజేశారు.తదుపరి వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి   తగిన చికిత్స పొందాలని చెప్పారు.మరియు గ్రామాలలో వాటర్ పైపులు లీకేజీలు ఎక్కడన్నా ఉన్నట్లయితే , వాటిని వెంటనే రిపేరు చేయించాలని,గ్రామ స్పెషల్ ఆఫీసర్లకు మరియు విలేజి సెక్రటరీలకు తెలియజేశారు.  నీటి కలుషితం వలన టైఫాయిడ్ మరియు జాండీస్ మొదలగు వ్యాధులు వస్తాయని తెలియజేశారు. అలాంటి వ్యాధులను అరికట్టాలంటే నీరు కలిసి కాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బనిసిలాల్ , ఎమ్.పీ.ఓ జయంత్ రెడ్డి , డాక్టర్ స్రవంతి,  డాక్టర్ రాఘవేందర్,  హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు,  ఎంపీహెచ్ఇఓ  శ్రావణ్ కుమార్, హెల్త్ సూపర్వైజర్లు శ్రీరామ,చంద్రకళ , పి.హెచ్.ఎన్ పుష్పలీల,హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్ ,  మరియు ఫరూక్ నగర్ మండల్ ఏఎన్ఎంలు , విలేజ్ సెక్రటరీలు మరియు విలేజ్ స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.