స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
On
విశ్వాంబర, వెల్దండ, జూలై 26 : - పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వెల్దండ మండల కేంద్రంలో మోడల్ కళాశాల నుండి తాసిల్దార్ ఆఫీస్ వరకు విద్యార్థి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర నాయకులు సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్లు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వము స్పందించి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, వెల్దండ మండల కేంద్రంలో ఎస్టి బాలికల హాస్టల్ చుట్టూ ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టూ ప్రహరి గోడ నిర్మించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు.లేకపోత పిడిఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అర్జున్, నితిన్, పవన్ ,అనిల్ ,మల్లేష్, శుక్లాల్ భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.