'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్ 

'కల్కి' సినిమా టికెట్ ధరల పెంపు.. సర్కార్ గ్రీన్‌సిగ్నల్ 

ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

ప్రభాస్ హీరోగా నాన్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది. 

ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 'కల్కి 2898 ఏడీ' చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 75, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి