అక్టోబర్ 6న రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం 

అక్టోబర్ 6న రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం 

విశ్వంభర, కర్మన్ ఘాట్ :హైద్రాబాద్ లో మరోసారి రంగ్ దే  దాండియా నైట్ కార్యక్రమం అక్టోబర్ 6వ తేదీన ఆదివారం సాయంత్రం 5 గంటలకు  కర్మన్ ఘాట్ లోని చంద్ర గార్డెన్స్ లో అట్టహాసంగా నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో తెలిపారు. దాండియా నైట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చని , చిన్న, పెద్ద తేడా లేకుండా అందరు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయ్యే ఈ నైట్ లో గేమ్స్ , డాన్స్ మస్తీ , ఎంటర్టైన్మెంట్ పోగ్రామ్స్ , చిల్డ్రన్స్ గేమ్స్ , పంజాబీ ధోల్ , ఫుడ్ స్టాల్ల్స్ , ఫోటో బూత్ , సర్ప్రైస్ బహుమతులు , లక్కీ డ్రా లతో మరెన్నో విశేషంగా ఆకట్టుకునే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.  ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా దాండియా నైట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని  డి. భాను ప్రకాష్ , కృష్ణవేణి ఓరుగంటి, ఆర్తం శ్రీవాణి , మహేశ్వరి పాలారపు , కె నగేష్ కుమార్ , అభిషేక్ కగ్ధ, శ్రీ ధన్య , బాలు ఏర్పాట్లు నిర్వహించనున్నారు. 

Tags: