రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు

రామోజీ అంటే క్రమశిక్షణ, నిబద్దతఃవెంకయ్య నాయుడు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్ని గంటల క్రితమే కన్నుమూశారు. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి మీడియా మొఘల్ దాకా ఎదిగారు ఆయన. అనేక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి.. తనకు సక్సెస్ తప్ప ఇంకోటి తెలియదన్నట్టు ఎదిగారు. అంతటి ఘనుడు.. అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. 

దాంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నరు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. అక్షర యోధుడు రామోజీరావు కన్నుమూయడం తెలుగు ప్రజలకు తీరనిలోటు అని తెలిపారు. రామోజీరావు అంటూ క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన అని తెలిపారు. అందుకే ఆయన అన్ని రంగాల్లోనూ విజయం సాధించినట్టు తెలిపారు. అలాంటి వ్యక్తి తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన తెలుగు ప్రజలకు గర్వకారణం అంటూ కొనియాడారు వెంకయ్య నాడు. 

Read More నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం