ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్ రూ.30 కోట్ల విరాళం
On
ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్ రూ.30 కోట్ల విరాళం
విశ్వంభర, హైదరాబాద్: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ రూ.30 కోట్ల విరాళం అందజేశారు. ఆడిటోరియం నిర్మాణానికి విరాళం సొమ్మును ఐఎస్‌బీ వినియోగించనుంది. 430 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ ఛైర్మన్ హరీశ్ మన్వానీ రామోజీ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.