బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సంకల్ప దివస్ సభ

WhatsApp Image 2024-07-26 at 17.49.05_6786d654విశ్వంబర కరీంనగర్ : -బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాధికార సంకల్ప దివస్ సభ

అనగారిన కులాల రాజకీయ ఆకాంక్షాలకు అంకురార్పణ జరిగిన రోజు జులై 26,1902. 

Read More ప్రారంభమైన CATCO సమావేశం 

-అడ్వకేట్ నిషాని రామచంద్రం  మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

అప్పటి వరకు భారత దేశం లో ఎక్కడ కూడా నిమ్న కులాలకు, వెనుకబడిన కులాలకు మరియు మహిళలకు విద్య  ఉద్యోగ రంగాల్లో  రాజ్య పాలన లో ఎలాంటి ప్రతినిత్యం లేదు. 
చత్రపతి,సాహు మహారాజ్
 తన రాజ్యంలో బ్రహ్మనేతర కులాలకు 50% రిజర్వేషన్లను అమలు చేసిన రోజు జులై 26

ఛత్రపతి సాహుమహారాజ్ వారి సంస్థానంలో july 26 1902, సంవత్సరం లో వెనుకబడిన కులాలకు, అంటరాని కులాలకు మరియు మహిళలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాడు. వీరు బ్రిటీష్ ఇండియా లోని కొలహాపూర్ సంస్థానానికి రాజు. వీరి రాజ్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.సాహుమహారాజ్ గారు వారి సంస్థానంలో వెనుకబడిన, నిమ్నవర్గాల పిల్లల కోసం ఉచిత నిర్భంద విద్య ప్రవేశపెట్టాడు. స్కాలర్షిప్స్ ప్రవశపెట్టాడు. విద్య కు దూరం అయిన కులాలకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించారు.  మహాత్మా  ఫూలే ప్రారంభించిన పాఠశాల లకు నిధులు కేటాయించి నిమ్న కులాల విద్యా వ్యాప్తి కోసం కృషి చేశారు. 

అంటరాని తనం నిషేధ చట్టం చేసి స్వయంగా తానే అమలు పరిచాడు. 
1919 లో బాల్య వివాహాలను రద్దు చేస్తూ, వితంతు పునర్వివహాలను చట్ట బద్దం చేశారు. సతి సహాగమన నిషేధ చట్టం చేశారు. వెనుకబడిన కులాల విద్యార్థులకు అంటరాని జాతుల కులాలకు వసతి గృహాలు ఏర్పాటు చేశారు. మహిళలకు మొదటిసారిగా భూమి పై హక్కు కల్పించారు. రైతుల కోసం ప్రాజెక్టు లు కట్టించారు. వ్యవసాయం అభివృద్ధి కోసం రైతులకు అనేక సహకారాలు అందించారు.  

న్యాయవ్వవస్థ లో అనేక మార్పులు తీసుకవచ్చి  హిందూ లా ని రూపొందించారు. 
1919 జనవరి లో కులాంతర వివాహాలను చట్టబద్దం చేస్తూ,  స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేశారు.

1920లో జోగిని, దేవదాసి రద్దు చేస్తూ చట్టాన్ని చేశారు.

           ఛత్రపతి సాహుమహారాజ్ గారు 1874 జూన్ 26 నాడు కొలహాపూర్ సంస్థానంలో జన్మించారు.

1922 మే 06 నాడు మరణించారు. Dr. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాహుమహారాజ్ గారి ఆశయాలు, లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది..
బహుజన రాజ్యం లో నే సాహు మహారాజ్ గారి ఆశయాలు అమలావుతాయి 

ఈ సభ కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో జరుగగా  ముందుగా అయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించాము. ఈ సభ జిల్లా అధ్యక్షులు దొడ్డే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినది  పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం మాజీ కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, మాతంగి అశోక్ , మాజీ జిల్లా ఇంచార్జ్ మంద బాలయ్య , కళ్ళేపెల్లి రాజేందర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాళి తిరుపతి,  కమిటీ  కార్యదర్శి లు  పల్లె ప్రశాంత్ గౌడ్  మారపెల్లి మొగిలయ్య, నిషాని  రాజమల్లు,  కత్తెరపాక  రమేష్,   మాతంగి  తిరుపతి,  మంద సమ్మయ్య నాయకులు.                  
నాలుగు అసెంబ్లీ కమిటీ ల నాయకులు పాల్గొన్నారు.