కాంగ్రెస్ గూటికి  ఆర్ కృష్ణయ్య ❓

కాంగ్రెస్ గూటికి  ఆర్ కృష్ణయ్య ❓

విశ్వంభర, హైద‌రాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య,నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో ఈరోజు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్ద‌రు నేతలు చర్చించి నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడి గా కొన‌సాగిన ఆర్‌.కృష్ణ‌ య్య మంగ‌ళ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన నేపథ్యంలో విద్యానగర్ లోని ఆర్, కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ మల్లు రవి, కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు బీసీ సంఘం సంక్షేమ నాయ కులు చెబుతున్నారు.  మల్లు రవి ఆర్,కృష్ణయ్యతో  సమావేశం కావడం ప్రాధాన్య‌త సంత‌రించు కుంది.కాంగ్రెస్ పార్టీలోకి  ఆర్‌.కృష్ణ‌య్య చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి..

Tags: